![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -230 లో.... కావ్య కోరిన కోరిక తీర్చడానికి రాజ్ తనని అర్థరాత్రి ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటకు తీసుకొని వెళ్తాడు. కావ్యని తీసుకొని రాజ్ బైక్ పై వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు రాజ్ ని హగ్ చేసుకొని కూర్చొని ఉంటుంది కావ్య. ఏంటి ఇదంతా అని రాజ్ చిరాకు పడతాడు.
ఆ తర్వాత రాజ్ ఒక దగ్గర ఆగిన తర్వాత.. ఏం కావాలి? క్వార్టర్ కావాలా అని ఒక అబ్బాయి అడుగుతాడు. తీసుకోండని కావ్య చెప్పగానే.. అది ఏమైనా వాటర్ బాటిల్ అనుకున్నావా అని కావ్యకి కౌంటర్ వేస్తాడు రాజ్.. నాకు ఎలాంటి బ్యాడ్ అలవాటు లేదని రాజ్ అంటాడు. అదేంటో ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకుండా ముద్ద పప్పులా పెరిగారని కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఒక పాన్ షాప్ అతను షాప్ క్లోజ్ చెయ్యకుండా బయటకు వెళ్తాడు.
అప్పుడే రాజ్ కావ్య లు ఆ షాప్ దగ్గర ఆగుతారు. ఎవరు లేరు షాప్ లో అని అనుకోని లోపలికి వెళ్లి షటర్ క్లోజ్ చేస్తారు.. ఇక కావ్య కీ ఇష్టమైన స్వీట్ పాన్ ని స్వయంగా రాజ్ కట్టిస్తాడు. ఆ తర్వాత కావ్య స్వయంగా రాజ్ కి మాసాల పాన్ కట్టిస్తుంది. అందులో కొంచెం జర్ధాను కావ్య కలుపుతుంది. అందువల్ల రాజ్ ఆ పాన్ తిని మత్తుగా మాట్లాడతాడు. అంతేకాకుండా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తారు. కాసేపటికి షాప్ ఓనర్ వచ్చి లోపల ఎవరో ఉన్నారు. నా షాప్ లో దొంగలు ఉన్నారని అనుకొని పోలీస్ లకి ఫోన్ చేస్తాడు.
ఆ తర్వాత షాప్ దగ్గరికి పోలీసులు వస్తారు. ఇందులోనే దొంగలు ఉన్నారంటూ షటర్ ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి రాజ్ మత్తులో డాన్స్ చేస్తుంటాడు. బయట పోలీసులని చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. నా షాప్ లో దొంగ, దొంగది అని షాప్ యాజమాని చెప్తాడు. మేం దొంగలం కాదంటూ రాజ్ గురించి చెప్తున్న కావ్యని.. పరువు తియ్యకంటూ రాజ్ ఆపేస్తాడు. ఆ తర్వాత మేం దొంగలం కాదు నాకు కిళ్లీ తినాలని ఉంటే నా భర్త నన్ను తీసుకొని వచ్చాడు. షాప్ ఇక్కడ ఓపెన్ ఉంది. అందుకే లోపలికి వచ్చి కిళ్లీ తిన్నామంటూ కావ్య అమాయకంగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |